Sample Name

Senior Journalist

Sample Name

Reporter

August 2022
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
September 29, 2022

HK News

Telugu News Channel

దేశవ్యాప్తంగా జరగబోయే జనాభా లెక్కల్లో బీసీ లను కులాల వారీగా లెక్కించాలి.

1 min read

దేశవ్యాప్తంగా జరగబోయే జనాభా లెక్కల్లో బీసీ లను కులాల వారీగా లెక్కించాలి.

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
బొల్లం లింగమూర్తి పటేల్

హిందుస్థాన్ కలం గీత భవన్ చౌరస్త (కరీంనగర్)

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ ఆధ్వర్యంలో
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ (గీత భవన్ చౌరస్తాలో) కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది, బొల్లం లింగమూర్తి పటేల్ మాట్లాడుతూ కేంద్రం బీసీలను మోసం చేస్తుందని కేవలం బీసీలను ఓట్లకోసం వాడుకుంటున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని.
చట్టసభల్లో విద్య, ఉద్యోగ రంగాలలో బీసీలకు 50% రిజర్వేషన్ల కోసం బిల్లును ప్రవేశపెట్టాలి,
కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ లో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి,
దేశవ్యాప్తంగా 60%ఉన్న బీసీల జనాభాకు లభిస్తున్న రిజర్వేషన్ 27% అమలవుతున్నది 15% ఇక బీసీలు మేలుకోకపోతే భవిష్యత్తుకు ప్రమాదం

భారతదేశంలో బిసి కులాలు లెక్కలు లేకపోవడం వలన దేశంలో 52% శాతం అనగా సగభాగం పైన ఉన్న బీసీ కులాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. సామాజికంగా రాజకీయంగా విద్య ఉద్యోగ ఆర్థిక రంగాలలో బిసి కులాల వారు తీవ్రంగా అణచివేతకు గురవుతున్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న, జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీ కులాల జనగణన చేయకపోవడం వలన బీసీ ప్రజలు మన దేశ స్వతంత్ర ఫలాలు అనుభవించడం లేదు. దేశంలో బీసీలకు ఒక న్యాయం ఇతర వర్గాలకు ఒక న్యాయం జరుగుతుంది. ప్రస్తుతం 75 సంవత్సరాలుగా పాలన సాగిస్తున్న పాలకులు బీసీలకు చేయకుండా కుట్రలు చేస్తున్నారు.
బ్రిటిష్ ఇండియా పాలనలో ఆరుసార్లు 1881 నుండి 1931 వరకు దేశంలో ఉన్న దాదాపు 6500 కులాలను కుల ఆధారిత జనగణన ద్వారా లెక్కలు చేశారు. కానీ భారతదేశంలో స్వదేశీ పరిపాలన అమలులోకి వచ్చిన తర్వాత బీసీ ల కుల ఆధారిత జన గణన చేయకుండా కుట్రలు చేస్తున్నారు. మన దేశంలో చెట్లకు పుట్టులకు జంతువులకు కూడా లెక్కలు ఉన్నాయి. కానీ బీసీ లకు మాత్రం లెక్కలు లేకుండా పాలకులు కుట్ర చేశారు. 2011 UPA ప్రభుత్వ హయాంలో చూసి సోషియా ఎకనామిక్ కాస్ట్ బెస్ట్ సెన్సెస్ జనాభా లెక్కలు చేసిన. వాటిని బయట పెట్టలేదు. 2018 లో సాక్షాత్తు అప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 2021 లో జరగబోయే దేశవ్యాప్త జనాభా లెక్కల్లో బీసీ కులాల లెక్కలు చేస్తామని ప్రకటించారు. అందువలనే బిజెపి పార్టీకి 2019 ఎన్నికల్లో 300 పైగా ఎంపి స్థానాలు బీసీ ప్రజలు కట్టబెట్టారు. నరేంద్ర మోడీ గారు బీసీలలో ఎంబీసీ కులానికి చెందిన వ్యక్తి కావడం వలన దేశానికి ప్రధానమంత్రి అయితే బీసీల కష్టాలు తీరుతాయని భారత దేశంలో ఉన్న 20 కోట్ల మంది బీసీ ప్రజలు భావించారు కానీ వాళ్ళ ఆశలు అడివి దేశంలో బీసీల పరిస్థితి పెనం పై నుంచి పొయ్యిలో పడినట్లు అయింది.
ఎన్నిసార్లు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు బీసీలకు పెంచాలని మేధావులు ఉద్యమకారులు కేసులు వేసినప్పుడు కులాల జనాభా లెక్కలు ఉంటే రిజర్వేషన్లు జనాభా తమాషా ప్రకారం పెంచవచ్చని పలుమార్లు వెల్లడించింది. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. బీసీ ఓటు బ్యాంకు కావాలి కానీ. బీసీ కులాల గణనం బీసీల సంక్షేమము ప్రభుత్వాలకు అవసరం లేదు వచ్చే పార్లమెంట్ సమవేశసల్లో బీసీ కులగణన జరపకపోతె దేశవ్యాప్తంగా ఈ ఉద్యమన్ని ముందుకు వెళ్తాము
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి , తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బాక రమేష్ , తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గాండ్ల రమేష్ పటేల్, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మునిగంటి అశ్విన్,. బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజు, బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అజయ్ పటేల్, చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ పైండ్ల మధు, బీసీ విద్యార్థి సంఘం నగర అధ్యక్షులు దూలం రాకేష్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఉల్లంగుల ఓదెల్,మునిగంటి అజయ్, సాయి, వి సాయి, బీసీ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…….

1 thought on “దేశవ్యాప్తంగా జరగబోయే జనాభా లెక్కల్లో బీసీ లను కులాల వారీగా లెక్కించాలి.

Leave a Reply

Your email address will not be published.