Sample Name

Senior Journalist

Sample Name

Reporter

September 2022
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
September 29, 2022

HK News

Telugu News Channel

నిజాం కబంధ హస్తాల నుండి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగించిన గొప్ప నేత -సర్దార్ వల్లభాయ్ పటేల్

1 min read

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 న పేరేడ్ గ్రౌండ్ లో ఘనంగా హైదరాబాద్ విమోచన అమృత్ ఉత్సవాలు

కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలనుండి సెప్టెంబర్ 17 ను అధికారికంగా ఎందుకు నిర్వహించ లేదు ?

తెరాస కేసీఆర్ ప్రభుత్వం కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఎంఐఎం ఆజ్ఞలతో ఈ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు

నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి -షాద్ నగర్ బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి

హిందుస్థాన్ కలం (షాద్ నగర్)

భారత హోమ్ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో 13 సెప్టెంబర్ 1948ప్రారంభించి నిరంకుశ నిజాం కబంధ హస్తాల నుండి ,మెడలు వంచి 17 సెప్టెంబర్ 1948 లో హైద్రాబాదు సంస్థానానికి విమోచన కల్గించిన ఆ మహాను బహునికి ఘనముగా షాద్నగర్ పటేల్ రోడ్ లో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది

ఈ సందర్భంగా షాద్ నగర్ బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు నిజాం కు వ్యతిరేకంగా అనేక మంది పోరాటం చేస్తున్న సందర్భంలో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభయ్ పటేల్ ఆపరేషన్ పోలోను 1948 సెప్టెంబర్ 13 న ప్రారంభము చేసి సెప్టెంబర్17 న నిజాం కబంధ హస్తాల నుండి హైదరాబాద్ సంస్థానానికి విమోచనం కలిగించిన భారత యూనియన్ లో ఈ యొక్క ప్రాంతాని విలీనం చేసినటువంటి మహానుభావుడు అనీ అన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వలు ఎందుకు సెప్టెంబర్17 ని అధికారికంగా నిర్వహించ లేదు సమాధానం చెప్పాలన్నారు కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం చేస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ .అదేవిధంగా టీఅర్ఎస్ పార్టీ గత 8 సంవత్సరాలుగా, తెలంగాణ ఏర్పడ్డాక కూడా సెప్టెంబర్17 ను చేయమంటే చెయ్యని కెసిఆర్ ప్రభుత్వం ఈ రోజు కేంద్రం ప్రకటించగానే ఇక్కడ జాతీయ సమైక్యత దినోత్సవం చేస్తామని చెప్పడం ఇది రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎంకు అనుగుణంగానే తెరాస కాంగ్రెస్ వ్యవహరిస్తోంది అన్నారు .ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అందే బాబయ్య ,సేరి విష్ణువర్ధన్ రెడ్డి ,మల్చాలం మురళి ,హరీశ్ ముది రాజ్ ,సత్యనారాయణ ,చెట్ల వెంకటేష్ ,వంశీకృష్ణ ,ప్యాట అశోక్ ,క్యామ మహేష్ , గజ్జెల ప్రవీణ్ ,నర్సింహ ,శేషయ్య ,అందే రమేష్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

More Stories

Leave a Reply

Your email address will not be published.